భారతదేశం, నవంబర్ 11 -- ఈ వారంలో రెండు మలయాళం వెబ్ సిరీస్‌లు, ఒక రొమాంటిక్ డ్రామా, ఒక హారర్ కామెడీ ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు లూక్‌మాన్ అవరాన్ నటించిన ఒక సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నవంబర్ 10 నుంచి నవంబర్ 16 మధ్య విడుదలయ్యే ఈ మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు అస్సలు మిస్ కాకూడదు.

సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన మూవీ అవిహితం. ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో రిలీజైంది. ఈ డార్క్ కామెడీ డ్రామాకు ఐఎండీబీలో 8.8 రేటింగ్ నమోదైంది. మన సమాజంలోని పితృస్వామ్య భావజాలం, సామాజిక నిబంధనలపై చేసిన మరో సాహసోపేత ప్రయత్నం ఇది. ఈ సినిమా తక్కువ థియేటర్లలోనే రిలీజైంది. దీంతో ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. ఉన్నిరాజ్, రెంజి కన్కోల్, వినీత్ చాక్యార్, ధనేష్ కొలియత్ వంటి నటీనటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.

ఇదొక మిస్ట...