భారతదేశం, అక్టోబర్ 29 -- ఓటీటీలోకి ఈవారం కన్నడ, తమిళం, మలయాళం భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు. వీటిలో ఓ రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమా, మలయాళం అత్యధిక వసూళ్ల మరో సినిమా కూడా ఉన్నాయి. మరి అవేంటో చూడండి.

కల్యాణి ప్రియదర్శన్ ఒక సూపర్ హ్యూమన్ పాత్రలో నటించిన మలయాళ మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర. ఈ సినిమాను సూపర్ హీరో, ఫాంటసీ, జానపద అంశాలను జోడించి తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో స్టార్ అతిథి పాత్రలు, బలమైన కథ, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అత్యధిక వసూళ్లు సాధించిన ఈ మలయాళం సినిమా ఏడు భాషల్లో శుక్రవారం అంటే అక్టోబర్ 31 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కా...