Hyderabad, జూన్ 23 -- గ్రహాలకు రాజు సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశి లోకి ప్రవేశిస్తాయి. ఈ సమయంలో మరో గ్రహంతో సంయోగం చెందుతాయి. కొన్ని సార్లు శుభ యోగాలు ఏర్పడితే, కొన్ని సార్లు అశుభ యోగాలు ఏర్పడతాయి. సూర్యుడు ప్రస్తుతం మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో సూర్యుడు మరో గ్రహంతో కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాడు.

జూన్ 23 అంటే ఈరోజు మధ్యాహ్నం 1:57కి, సూర్యుడు-శని 90 డిగ్రీల కోణంలో ఉంటారు. దీంతో కేంద్ర యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శనికి మధ్య తండ్రి-కొడుకుల సంబంధం ఉంటుంది అని అంటారు.

కేంద్ర యోగం ఏర్పడడం వలన కొన్ని రాశుల వారికి ఇది అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశుల వారికి పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి, ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి, సంతోషంగా ఉంటారు. ఉ...