భారతదేశం, డిసెంబర్ 4 -- మార్గశిర మాసం చాలా విశిష్టమైనది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాల నాడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే సిరి సంపదలు కలుగుతాయి. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది. హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని అంటారు. ఈ ఏడాది ఈ కోరల పౌర్ణమి డిసెంబర్ 4 అంటే ఈరోజు వచ్చింది.

హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి దాకా యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. దీంతో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కోరల పౌర్ణమి అంటే యమధర్మరాజుకి ఎంతో ఇష్టం. యమధర్మరాజుని ఆ రోజు పూజిస్తే శాంతి కలుగుతుందని నమ్మకం. అందుకే ఈరోజు యమధర్మరాజుని ఆరాధించాలి.

ఈరోజు కుడుములు చేసి కాలభైరవుడి వాహనం అయినటువంటి కుక్కలకు వేస్తే మంచి జరుగుతుం...