భారతదేశం, జనవరి 23 -- ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వసంత పంచమి జనవరి 23, శుక్రవారం నాడు అనగా ఈరోజు వచ్చింది. ఇది చాలా పవిత్రమైన రోజు. చిన్నారుల జీవితంలో తొలి విద్యారంభానికి ఇది శుభప్రదమైన రోజు అని చెప్పొచ్చు.

విద్య, వాక్కు, కళలకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతి దేవిని వసంత పంచమి నాడు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. వసంత పంచమి 2026 చాలా విశేషమైన రోజు. ఈ రోజు చేసే కార్యాలకు పంచాంగ దోషాలు ఉండవు. పిల్లల చేత అక్షరాభ్యాసం చేయిస్తారు.

వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతి దేవి అనుగ్రహంతో పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారని.. జ్ఞానం, బుద్ధి, వాక్కు లభిస్తాయని నమ్ముతారు.

చాలా విద్యాలయాల్లో ప్రత్యేకంగా సరస్వతీ పూజలు నిర్వహిస్తారు.

పలకలు, పుస్తకాలు, పెన్నులు వంటి వాటిని పంచి పెడతారు. అ...