భారతదేశం, డిసెంబర్ 1 -- మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి నాడు మోక్షద ఏకాదశిని జరుపుతారు. ఆ రోజు ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. ఈసారి ఏకాదశి తిథి నవంబర్ 30న రాత్రి 9:28 గంటల నుంచి ప్రారంభమై డిసెంబర్ 1న రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 1, సోమవారం నాడు మోక్షద ఏకాదశి జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున ఉపవాసం ఉంటే మోక్షానికి దారితీస్తుంది. ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. మోక్షద ఏకాదశి రోజున గీతా జయంతి కూడా రావడం విశేషం.

ఏకాదశి తిధి ప్రారంభం: 30 నవంబర్ 2025 రాత్రి 9:29

ఏకాదశి తిధి ముగింపు: 1 డిసెంబర్ 2025, రాత్రి 7:01

భద్ర కాలం: ఉదయం 8:20 నుండి రాత్రి 7:01 వరకు

పూజ కోసం విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటో, గంగా నీరు, దీపం మరియు నెయ్యి / నూనె, వత్తులు, అగరబత్తీలు...