Hyderabad, సెప్టెంబర్ 3 -- పరివర్తిని ఏకాదశి 2025: భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని పార్శ్వ ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. పరివర్తిని ఏకాదశి రోజున దానధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతగా భావిస్తారు.

మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో సంపద మరియు ఆనందం పెరుగుతాయి. ఉదయ తిథి ప్రకారం, పరివర్తిని ఏకాదశి ఉపవాసాన్ని సెప్టెంబర్ 3న ఆచరించాలి. అదే విధంగా ఈ శక్తివంతమైన పరివర్తిని ఏకాదశి నాడు దానం చేస్తే కూడా మంచిది. మరి పరివర్తిని ఏకాదశి నాడు ఏం దానం చేయాలో తెలుసుకుందాం.

పరివర్తిని ఏకాదశి నాడు పూజ, దానం ఏ సమయంలో చేయాలంటే విషయానికి వస్తే.. ఈ రోజు ఉదయం లాభ, అమృత ముహూర్తంలో ...