Hyderabad, జూన్ 25 -- జ్యేష్ఠ అమావాస్య 2025: హిందూ మతంలో జ్యేష్ఠ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, పూజించడం, దానధర్మాలు చేయడం ఎంతో ప్రయోజనకరంగా భావిస్తారు. ఈ ఏడాది జ్యేష్ఠ అమావాస్య జూన్ 25 బుధవారం నాడు వచ్చింది. ఈ రోజున పూజించడం, దానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోయి, సంపద పెరుగుతుందని నమ్ముతారు.

అమావాస్య రోజున పితృదేవతలకు శ్రాద్ధ, తర్పణ, పిండ దానాలను కూడా నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి, వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. జ్యేష్ఠ అమావాస్య రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. జ్యేష్ఠ అమావాస్య స్నాన ముహూర్తం మరియు పరిహారాలు గురించి తెలుసుకోండి.

జ్యేష్ఠ అమావాస్య నాడు స్నానానికి మంచి సమయం ఉదయం 04:05 నుండి 04:45 వరకు ఉంటుంది. ఉదయం 0...