Hyderabad, జూలై 31 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తున్నప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. శుభ యోగాలు శుభ ఫలితాలను అందిస్తాయి. శని దేవుడి ప్రభావం కొన్ని రాశుల వారిపై ఎక్కువ కాలం ఉంటుంది, ఎందుకంటే శని నెమ్మదిగా కదిలే గ్రహం. పైగా, శని మనం చేసే మంచి పనులకు మంచి ఫలితాలను, చెడ్డ పనులకు చెడు ఫలితాలను అందిస్తాడు.ప్రస్తుతం శని మీన రాశిలో తిరోగమనం లో ఉన్నాడు.

జూలై 31న, అంటే ఈరోజు శని, గురువు వంద డిగ్రీల దూరంలో ఉన్నారు. దీంతో అరుదైన యోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను అందుకుంటారు. కొన్ని రాశుల వారి జీవితంలో ఈ యోగం శుభ ఫలితాలను తీసుకురావడంతో పాటు, కెరీర్‌లో, ఆర్థికపరంగా కూడా ఎన్నో మార్పులను తీసుకువస్తుంది.

సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మరి ఈ అరుదైన యోగం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ...