భారతదేశం, అక్టోబర్ 30 -- కార్తీక మాసంలో పరమశివుడుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కార్తీక మాసంలో సోమవారం రోజున శివుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. కార్తీకమాసంలో కోటి సోమవారం మరింత విశిష్టమైనది. కోటి సోమవారం నాడు ఆచరించే స్నానం, దానం, ఉపవాసానికి ఎన్నో కోటి రెట్ల ఎక్కువ ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.

ఈ సంవత్సరం కోటి సోమవారం అక్టోబర్ 30న వచ్చింది. అక్టోబర్ 29 సాయంత్రం 5:29కి శ్రవణ నక్షత్రం మొదలై, అక్టోబర్ 30 సాయంత్రం 6:30 వరకు కొనసాగుతుంది. ఈ లెక్కన అక్టోబర్ 30న కోటి సోమవారాన్ని జరుపుకోబోతున్నారు.

వ్యాస మహర్షి రాసిన స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే, కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం నాడు కోటి సోమవారం అని పిలుస్తారు. శివ కేశవులకు కార్తీకమాసం అంటే ఎంతో ఇష్టం. అందులో కోటి సోమవారం చాలా ప్రత్యేకమైనది, శివకేశవులకు ఎంతో ఇష్టమైన రోజు....