భారతదేశం, నవంబర్ 20 -- కార్తీకమాసం ఇక పూర్తి కాబోతోంది. ఈరోజే కార్తీక అమావాస్య. కార్తీక అమావాస్య నాడు పితృ పూజకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు పితృదేవతలను ఆరాధించడం వలన పితృదేవతల అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కార్తీకమాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా విశేషమైనది. కార్తీక అమావాస్య నవంబర్ 20 అంటే ఈరోజు వచ్చింది. ఈరోజు పవిత్ర స్నానాలు చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి.

శ్రార్ధ కర్మ, పితృతర్పణం, నిరుపేదలకు సహాయం చేయడం వంటివి చాలా మంచి ఫలితాలను తీసుకొస్తాయి. పితృదోష నివారణ కోసం చాలామంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు, దానాలు చేస్తూ ఉంటారు. కార్తీక అమావాస్య నాడు ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి? ఎలాంటి తప్పులు చేయకూడదు? అనే విషయాలను తెలుసుకుందాం.

కార్తీక అమావాస్య నాడు చంద్రుడిని పూజించడం, ఉపవాసం ఉండడం వ...