Hyderabad, జూలై 21 -- ప్రతి సంవత్సరం ఆషాడ మాసం కృష్ణపక్షం వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటాము. ఆ రోజు విష్ణు మూర్తిని ఆరాధిస్తే మనసులో కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. విష్ణు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మొదటి ఏకాదశి కావడం వలన పవిత్రంగా స్వామి వారిని పూజిస్తారు. కామిక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, జాగరణ చేయడం వలన విష్ణు మూర్తి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.

కామిక ఏకాదశి నాడు ఈ మంత్రాలను పఠిస్తే మంచిదే. కెరియర్‌లో పురోగతి సాధించాలంటే ఈ పరిహారాలను పాటించండి. రావి ఆకులను తీసుకుని, పసుపు లేదా గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఈ ఆకులను విష్ణుమూర్తికి సమర్పించాలి. వీటిని సమర్పించే సమయంలో

"ఓం నమో నారాయణాయ నమః" లేదా "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః" మంత్రాన్ని పఠించండి. ఈ రోజు రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగిస్తే కూడా మంచిగా జరుగ...