Hyderabad, జూలై 6 -- జూలై 6న ఆషాఢ మాసంలో వచ్చే మొదట ఏకాదశి అయినటువంటి తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది. తొలి ఏకాదశి నాడు మహావిష్ణువును ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. విష్ణువు అనుగ్రహాన్ని పొందడానికి తొలి ఏకాదశి శక్తివంతమైన రోజు. తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి, తొలి ఏకాదశి నాడు ఎటువంటి వాటిని ఆచరించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు, పూజ చేయడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

తొలి ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది. శరీర, మానసిక శాంతిని పొందవచ్చు. ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. కుటుంబం సుఖంగా ఉంటుంది. సంపదలను ఆకర్షించవచ్చు.

తొలి ఏకాదశి నుంచే పండుగలు అన్ని మొదలవుతాయి. అందుకనే దీనిని తొలి ఏకాదశి అని, తొలి పండుగ అని అంటారు. దీనినే "శయన ఏకాదశి" అని కూడా అంటారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో...