Hyderabad, జూలై 24 -- ప్రతి అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజు ఆషాఢ అమావాస్య, పితృదేవతల్ని పూజిస్తే వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆషాఢ అమావాస్యనాడు పితృదేవతలను ఏ విధంగా పూజించాలి? వారి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆషాఢ అమావాస్యని భీమ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈరోజు భూమిపై పితృదేవతలు సంచరిస్తారు.

ఆషాఢ అమావాస్య నాడు పూజ గదిలో పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై శివ పార్వతుల విగ్రహాన్ని పెట్టాలి. ఆషాఢ అమావాస్యనాడు శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పిస్తే మంచిది. అదేవిధంగా పార్వతీ దేవికి పసుపు, కుంకుమలు, పూలతో పూజ చేయాలి.

ఆషాఢ అమావాస్యనాడు సుమంగళి ఉపయోగించే వస్తువులను పార్వతి దేవి పూజ కోసం ఉపయోగి...