Hyderabad, జూన్ 30 -- ఈరోజు స్కంద పంచమి, సోమవారం. చాలా మంచి రోజు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన సమస్యలన్నీ తొలగి సంతోషంగా ఉండవచ్చు. ఎలాంటి బాధలు ఉన్నా సరే, ఈరోజు తొలగిపోతాయి. స్కంద పంచమి నాడు ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలని పాటిస్తే మంచిది వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ఆషాడ మాసంలో వచ్చే ఈ స్కంద పంచమి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకుని 11 సార్లు స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటే మంచిది. అలాగే, "ఓం శం శరవణభవాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. చాలా కాలం నుంచి వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికే వివాహం అయ్యే అవకాశం ఉంది.

సంతానం కలగాలంటే కూడా ఈ పరిహారాలను పాటించండి. రాహు, కేతువుల వలన కాలసర్ప దోషంతో బాధపడే వారు ...