భారతదేశం, నవంబర్ 8 -- సంకష్టహరచతుర్థి 2025: ఈరోజు శనివారం,సంకష్టహర చతుర్థిని జరుపుతారు. కార్తీక మాసంలో కృష్ణ పక్షంలో నాల్గవ రోజున సంకష్టహర చతుర్థి జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, చతుర్థి తిథి నవంబర్ 8 న ఉదయం 07:32 గంటలకు ప్రారంభమై నవంబర్ 9న తెల్లవారుజామున 4.25 గంటలతో చతుర్థి తిథి ముగుస్తుంది.

ఈ రోజున, గణపతిని సకల ఆచారాలతో పూజించడం, ఉపవాసం చేయడం వల్ల చాలా క్లిష్టమైన సమస్యలను కూడా తొలగించవచ్చు. సంకష్ట చతుర్థి సందర్భంగా ఈ రోజు పూజా ముహూర్తం, చంద్రోదయ సమయం, పూజ పద్ధతి గురించి తెలుసుకుందాం.

బ్రహ్మ ముహూర్తం: ఉదయం 04:53 నుండి ఉదయం 05:46 వరకు

శుభ సమయం: ఉదయం 05:20 నుండి ఉదయం 06:38 వరకు

అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:26 వరకు

విజయ ముహూర్తం: మధ్యాహ్నం 01:53 నుండి 02:37 వరకు

గోధులీ ముహూర్తం:...