భారతదేశం, డిసెంబర్ 10 -- ప్రతి ఒక్కరూ ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని సార్లు జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలా మంది గ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు. అలాగే సంతానం లేక చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇది అమూల్యమైన రోజు అని చెప్పవచ్చు.

డిసెంబర్ 10 అంటే ఈరోజు షష్టి, ఆశ్లేష నక్షత్రం రావడం చాలా విశేషం. ఈరోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే సమస్యలన్నీ తొలగి ఆనందంగా ఉండొచ్చు. సంతాన యోగం కలగడానికి ఈరోజు కొన్ని పరిహారాలను పాటించండి. అలాగే కుజ దోషం, రాహు-కేతు దోషాల నుంచి బయటపడడానికి కూడా వీలవుతుంది. అలాంటి సమస్యలు కలిగిన వారు ఈ రోజు ఏమి చేయాలి? ఎలా పూజించాలి? పాటించాల్సిన పరిహారాలు ఏంటి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు షష్టి, ఆశ్లేషా నక్షత్రం, బుధవారం మూడు కలిసి రావడం చాలా విశేషం అని చెప్పొచ్చు. క...