Hyderabad, అక్టోబర్ 10 -- వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోయి, సంతోషంగా ఉండొచ్చు. ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే, తొలగిపోతాయి. ప్రతి పనిలో విజయం అందుతుంది. అక్టోబర్ 10 అంటే ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈ రోజు వినాయకుడిని ప్రత్యేకించి ఆరాధించడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి.

అదే విధంగా లక్ష్మీ గణపతి అనుగ్రహం ఉంటే, ఏడాది అంతా కూడా డబ్బుకి లోటు ఉండదు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించొచ్చు, ఆర్థిక ఇబ్బందులే ఉండవు, అప్పులు తీరిపోతాయి. మీకు రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వస్తుంది. ఇలా దీపారాధన చేస్తే మంచిది.

ఒక ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పెట్లు బియ్యం పొయ్యండి. ఈ వస్త్రానికి కొంచెం పసుపు కుంకుమ రాయండి. కొన్ని తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు కూడా వేయండి. 11 రూపాయి కాసులు కూడా వెయ్యండి. ఆ తర్వాత మూటను కట్టేసి వినాయకుడి దగ్గర పెట్టి ప్రార్థి...