Hyderabad, జూన్ 28 -- జూన్ 28, శనివారం అంటే ఈరోజు అశుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈరోజు చంద్రుడు సింహరాశిలోకి అడుగుపెడతాడు. ఇప్పటికే, కేతువు ఇదే రాశిలో ఉన్నాడు. ఈ రెండింటి కలయిక వలన, గ్రహణ యోగం ఏర్పడింది. పైగా, కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు.

దీంతో, అశుభ యోగం ప్రభావం ఇంకా పెరిగింది. ఇది ఇలా ఉంటే, శని షడాష్టక యోగాన్ని చంద్రుడు కుజులతో సంయోగం చెంది సృష్టించాడు. శని పుష్య యోగం కూడా ఈరోజు ఏర్పడింది. దీంతో, ఐదు రాశుల వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

ఈరోజు మూడు అశుభ యోగాలు ఏర్పడడం వలన, కొన్ని రాశుల వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశుల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకుని, జాగ్రత్తగా ఉండడం మంచిది.

మేష రాశి వారికి, ఈ అశుభ యోగాల వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు రావచ్చు. ఒత్తిడి ...