భారతదేశం, డిసెంబర్ 30 -- విష్ణువు అనుగ్రహం కలగాలని వివిధ రకాల మార్గాలను అనుసరిస్తారు. ముఖ్యంగా ఏకాదశి తిథి నాడు విష్ణువుని ఆరాధిస్తే ఎంతో మేలు కలుగుతుందని, అనుకున్నవన్నీ పూర్తవుతాయని నమ్మకం. విష్ణు అనుగ్రహంతో దేనికీ లోటు ఉండదు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి చాలా విశేషమైనది. ఇంత విశిష్టత కలిగిన ఏకాదశి నాడు విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మేలు కలుగుతుంది. బాధలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు.

అలాగే, విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ పూలను సమర్పిస్తే విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. ఏ విధమైన బాధలు ఉండవు. పైగా, ఈరోజు పుత్రదా ఏకాదశి కూడా. పుత్రదా ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధిస్తే పుత్రుడు జన్మిస్తాడని, అలాగే పిల్లలు ఉన్నవారు ఈ ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించడం వలన పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుందని, ఆనందంగా...