భారతదేశం, నవంబర్ 25 -- ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి నాడు వివాహ పంచమి జరుపుకుంటాము. సీతారాములకి ఈరోజే వివాహమైందని అంటారు. ఈరోజు శ్రీరాముడు, సీతాదేవి తండ్రి జనక మహారాజు ఏర్పరిచిన స్వయంవరానికి వెళ్లి శివధనస్సును విరిచి సీతను పెళ్లాడిన రోజు.

ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. వైవాహిక జీవితంలో ఆనందం ఉండాలన్నా, పెళ్లి కాని వారికి పెళ్లి కుదరాలన్నా, సీతా రాములను ఆరాధిస్తూ కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే శుభఫలితాలను పొందవచ్చు. వివాహ జీవితంలో సంతోషం ఉంటుంది. పైగా ఈరోజు కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఉండడం మరింత విశేషం.

పంచాంగం ప్రకారం మార్గశిర శుక్లపక్ష పంచమి తిథి నవంబర్ 24 రాత్రి 9:22కు మొదలై నవంబర్ 25 రాత్రి 10:56 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం వివాహ పంచమి జరుపుకోవాలి. కనుక నవంబర్ 25, అంటే ఈరోజు జరుపుకోవాలి. ఈరోజు కొన్ని ప్రత్యేకమై...