భారతదేశం, జనవరి 23 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులను తీసుకు వస్తుంది. ఈరోజు వసంత పంచమి సందర్భంగా గజకేసరి రాజయోగం ఏర్పడడం విశేషం. గజకేసరి రాజయోగంతో 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు రానున్నాయి. వసంత పంచమితో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ యోగంతో కొన్ని రాశుల వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తెలివితేటలు ఎక్కువ అవుతాయి. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. కెరీర్‌లో కూడా మంచి మార్పులు ఉంటాయి. అలాగే సరస్వతి దేవి ప్రత్యేక అనుగ్రహాన్ని కూడా పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థిక ...