Hyderabad, జూలై 25 -- ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజు. ఈరోజు నుంచి శ్రావణమాసం మొదలయ్యింది. పైగా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా. అదే కాకుండా ఈ రోజుకు మరో ప్రత్యేకత ఉంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. జూలై 25 చాలా మంచి రోజు, ముఖ్యమైన రోజు.

శ్రావణమాసం మొదలవడంతో పాటుగా పుష్యమి నక్షత్రం ఉంది. పైగా ఈరోజు వజ్ర యోగం కూడా ఏర్పడింది. ఈరోజు సిద్ధి యోగం కూడా ఏర్పడి, రోజంతా సిద్ధి యోగం ఉంటుంది.

జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పుష్యమి నక్షత్రం చాలా మంచిది. ఏదైనా పనులను మొదలు పెట్టడానికి, షాపింగ్, ప్రయాణాలు, ఇన్వెస్ట్మెంట్ వంటి వాటికీ చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి. డబ్బు, గౌరవం ఉంటాయి. క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉన్న వారికి కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా కలిసి వస్తుంది. ఇ...