Hyderabad, ఆగస్టు 5 -- శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు. పుత్రదా ఏకాదశి నాడు శుభ యోగాలు ఏర్పడతాయి. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించి ఉపవాసం ఉంటే శుభ ఫలితాలను పొందవచ్చు. సంతానం లేని వారు సంతానం కలగడానికి ఈ పుత్రద ఏకాదశి నాడు ప్రత్యేకంగా వ్రతం చేస్తారు. అదే విధంగా ఉపవాసం కూడా ఉంటారు.

పుత్రదా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పూజ చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు సంతోషంగా ఉంటారు. ఈ ఏకాదశి నాడు మహా విష్ణువుని, లక్ష్మీ దేవిని ఆరాధిస్తే విష్ణువు మీ కోరికలను తీరుస్తాడు. ఈసారి పుత్రదా ఏకాదశి ఆగస్టు 5, మంగళవారం అంటే ఈరోజు వచ్చింది. పైగా ఈరోజు మంగళగౌరీ దేవి వ్రతం కూడా చేసుకుంటారు. వీటితో పాటు తర్వాత సిద్ధి యోగం, రవి యోగం కూడా ఏర్పడ్డాయి.

మేష రాశి వారికి పుత్రదా ఏకాదశి శుభ ఫలితాలను తీసుకు...