Hyderabad, జూలై 7 -- తెలుగు టీవీ సీరియల్స్ విషయంలో స్టార్ మా ఛానెల్ కొన్నాళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అలాంటి ఛానెల్ నుంచి కొత్త సీరియల్ వస్తుందంటే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇప్పుడా ఛానెల్ నుంచి నిండు మనసులు అనే కొత్త సీరియల్ రాబోతోంది. సోమవారం (జులై 7) నుంచే ప్రారంభం కానుంది.

స్టార్ మా ఛానెల్లో సరికొత్త సీరియల్ నిండు మనసులు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానుంది. కొన్ని నెలల కిందటే ఈ సీరియల్ విషయాన్ని స్టార్ మా తెలిపింది. తాజాగా లాంచ్ ఎపిసోడ్ గురించి సోమవారం (జులై 7) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ఇరువురి దారులు వేరైనా.. మనసులు కలిసే చోటే చివరి మజిలీ.. లాంచ్ ఎపిసోడ్ మిస్ కావద్దు.. ఈరోజే స్టార్ మాలో" అనే క్యాప్షన్ తో స్టార్ మా ట్వీట్ చేసింది. ముందు రోజు ఓ ప్రోమోను క...