భారతదేశం, నవంబర్ 21 -- తెలుగు మాసాల్లో మార్గశిర మాసం చాలా ఉత్తమమైనది. ఈ విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. "మాసానాం మార్గశీర్షోహమ్" అని అంటారు. మార్గశిర మాసం లక్ష్మీనారాయణుడికి చాలా ఇష్టం. ఈ నెలలో చేయాల్సిన పూజలు, పుణ్య కార్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఈ రోజున పోలి పాడ్యమి నుంచి మార్గశిర మాసం మొదలవుతుంది. పోలి పాడ్యమి నాడు ప్రవహించే నీటిలో దీపాలను వదులుతారు. పోలి పాడ్యమి కథను చదువుకుంటారు.

తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసం తొమ్మిదవ మాసం. ఈ నెలలో చేసే పూజలు, ఉపవాసాలు ఎంతో మంచి ఫలితాన్ని తీసుకువస్తాయి. సిరి సంపదలను, శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ నెలలోనే ధనుర్మాసం కూడా మొదలవుతుంది. అందుకనే దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు.

నవంబర్ 21 అంటే ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలై డిసెంబర్ 20 వరకు ఉంటుంది. ఈ నెల రోజులు దీపారాధన చేసి, లక్ష్మీ...