Hyderabad, జూలై 16 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. సూర్యుడు కూడా ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడి గమనాన్ని ఆధారంగా తీసుకుని కాలాన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. భూమధ్యరేఖకు ఉత్తరం వైపు సూర్యుడు కనబడితే అది ఉత్తరాయణం, అదే భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తే అది దక్షిణాయనం. అంటే సంవత్సరంలో ఆరు నెలలు ఉత్తరాయణం, మరో ఆరు నెలలు దక్షిణాయనం.

దేవతలకు ఉత్తరాయణం అంతా పగలు, దక్షిణాయనం అంతా రాత్రి. దక్షిణాయనంలో మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఈ సమయంలో ఉపవాసాలు చేయడం, పూజలు చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగులు చాతుర్మాసంలో దీక్ష చేస్తారు. చాతుర్మాసం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ ముందు వచ్చే ఏకాదశి వరకు ఉంటుంది.

దక్షిణాయనం సమయంలో పితృదేవతలను ఆరాధిస్తే మంచ...