భారతదేశం, డిసెంబర్ 9 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. కొన్నిసార్లు శుభ యోగాలు కలిగితే, కొన్ని సార్లు అశుభ యోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలాన్ని బట్టి గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి.

శుక్రుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను మారుస్తూ ఉంటాడు. శుక్రుడు రాశి మార్పు చెందినప్పుడు, నక్షత్ర మార్పు జరిగినప్పుడు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అనేక రాశుల వారు శుక్రుని రాశి మార్పు కారణంగా శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. శుక్రుడు సంతోషం, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. జాతకంలో శుక్రుడు స్థానం బాగా ఉంటే సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. డబ్బుకు కూడా లోటు ఉండదు.

ప్రస్తుతం శుక్రుడ...