Hyderabad, జూలై 6 -- ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. దీనిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. అప్పటి నుంచి చాతుర్మాసం మొదలవుతుంది. ఇది నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. జూలై 5న ఏకాదశి తిథి సాయంత్రం 6:58 గంటలకు మొదలై, జూలై 6 రాత్రి 9:14 వరకు ఉంటుంది. ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి.

కనుక జూలై 6న తొలి ఏకాదశి జరుపుకోవాలని సూచించబడుతుంది. ఈరోజు నుంచి విష్ణువు క్షీరసాగరంలో నిద్రించి, ప్రబోధినీ ఏకాదశి నాడు మేలుకొంటారు. ప్రబోధినీ ఏకాదశి కార్తీక మాసంలో వస్తుంది. ఈ నాలుగు నెలలు దేవతలు విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయంలో యజ్ఞం, వివాహం, గృహప్రవేశం వంటివి చేయకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచ...