Hyderabad, జూన్ 26 -- తెలుగు నెలల్లో నాలుగవది ఆషాడ మాసం. ఈ నెలతోనే వర్షఋతువు ప్రారంభమవుతుంది. ఆషాడ మాసంలో శుభకార్యాలు జరపరు. వివాహాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో జరపరు. ఆషాడ మాసంలో అత్తా-కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదని నమ్మకం కూడా ఉంది.

ఈ సారి ఆషాడ మాసం జూన్ 26, గురువారం ఆషాడ శుక్ల పాడ్యమి నుంచి మొదలవుతుంది. జూలై 24తో ముగుస్తుంది. ఇక ఈ నెల రోజులు పాటు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.

ఆషాడం అనేది "ఆది" అనే సంస్కృత నుంచి వచ్చింది. "ఆది" అంటే శక్తి అని అర్థం. ఆషాడ మాసంలో దేవతల్ని పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ఈ మాసంలో చేసే వ్రతాలకు, పూజలకు ఎంతో శుభ ఫలితాన్ని పొందవచ్చు.

ఉత్తరాయణ, దక్షిణాయన కథల ప్రకారం చూసినట్లయితే, శ్రీ మహావిష్ణువు ఆషాడ మాసంలోనే నిద్రలోకి వెళ్తారు. అందుకనే వివాహం చేసుకున్న దంపతులకు విష్ణు ఆశీస్సులు లభించవని నమ్మకంతో ఆషాడ మ...