Hyderabad, ఆగస్టు 30 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. దీంతో కొన్ని సార్లు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు చాలా ప్రత్యేకమైన శుభయోగం ఏర్పడనుంది. సింహ రాశిలో త్రిగ్రహి రాజయోగం ఏర్పడుతుంది. సింహ రాశిలో మూడు గ్రహాల సంయోగం చోటు చేసుకోవడంతో ఈ శుభయోగం ఏర్పడింది. ఈరోజు అంటే ఆగస్టు 30న సూర్యుడు, కేతువు, బుధుడు ఒకే రాశిలో సంచారం చేస్తున్నారు.

సూర్యుడు-బుధుడు-కేతువుల సంయోగం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకు రానుంది. పైగా ఇది చాలా శక్తివంతమైన రాజయోగం. త్రిగ్రాహి యోగం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశులు వారు కెరీర్‌లో ఊహించని మార్పులు చూస్తారు.

వ్యాపారంలో కొత్త అవ...