భారతదేశం, జనవరి 29 -- ఏకాదశి తిధికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధిస్తే మోక్షం లభిస్తుందని, ఆనందంగా ఉండవచ్చని నమ్ముతారు. సనాతన ధర్మంలో ఏకాదశి విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏకాదశికీ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో.

ఇక మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం జయ ఏకాదశి జనవరి 29, అనగా ఈరోజు వచ్చింది. ఈరోజు కొన్ని నియమాలు పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఏకాదశి ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించి ఉపవాసం ఉంటే జనన, మరణ చక్రం నుంచి విముక్తిని పొందవచ్చని నమ్ముతారు. మరణం ...