Hyderabad, సెప్టెంబర్ 18 -- ఈ నెల 18, అంటే ఈరోజు గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడింది. ఇలా గురువారం పుష్యమి రావడం వల్ల దీనిని గురు పుష్యమి యోగంగా భావిస్తారు. గురు పుష్యమి చాలా అరుదుగా వస్తుంది. అయితే గురు పుష్యమి నాడు ఏం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి, అదృష్టం కూడా ఉంటుంది.

గురు పుష్యమి యోగం చాలా శక్తివంతమైనది. ఈరోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వలన అన్నీ కలిసి వస్తాయి. త్వరలోనే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఈరోజు ఎలాంటి నియమాలను పాటించాలి? వీటిని కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.

గురువారం, పుష్యమి రావడం చాలా విశేషమైనది. ఈరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6:30 వరకు గురు పుష్యమి యోగం ఉంటుంది. అయితే ఈ విశిష్టమైన రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే అద్భుతమైన ఫలితాలను ...