భారతదేశం, నవంబర్ 28 -- మాసాలు అన్నిట్లో మార్గశిర మాసం చాలా విశిష్టమైనది. "మాసానాం మార్గశీర్షోహం" అని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి చాలా విశేషమైనది. ఈ ఏడాది నవంబర్ 28 అంటే ఈరోజు వచ్చింది. పైగా ఇదే రోజు శుక్రవారం, శతభిష నక్షత్రం రావడం కూడా విశేషం. దీనిని కాలభైరవ అష్టమి, కాలాష్టమి అని కూడా అంటారు. కాలభైరవ అష్టమి నాడు మీకు సమీపంలో ఉన్న కాలభైరవ ఆలయం లేదా శివాలయానికి వెళ్లి కూష్మాండ దీపాన్ని పెడితే చాలా మంచిది.

కాలాష్టమి రోజు కూష్మాండ దీపం వెలిగిస్తే ఎంతో చక్కటి ఫలితం ఉంటుంది. అయితే కూష్మాండ దీపం వెలిగించేటప్పుడు ఒక నల్లటి వస్త్రాన్ని కాలభైరవుని ఆలయంలో లేదా శివాలయంలో పరిచి, ఆ తర్వాత దానిపై రాళ్ళ ఉప్పు, నవధాన్యాలు వేసి బూడిద గుమ్మడికాయను మధ్యకు కోసి అందులో నువ్వుల నూనె వేసి, ఒక వత్తి పెట్టి వెలిగించాలి. దాని పై తోక మిరియాలను వే...