భారతదేశం, అక్టోబర్ 27 -- కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ప్రత్యేకించి పూజిస్తారు. నెల రోజులు కూడా దీపారాధన, నదీ స్నానాలు ఇలా ఎవరికి నచ్చిన పద్ధతుల్ని వారు పాటిస్తూ ఉంటారు. ఈరోజు మొదటి కార్తీక సోమవారం. ఈరోజు శివుడిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక సోమవారం సాయంత్రం ఇలా ఐశ్వర్య దీపం పెడితే చాలా మంచి జరుగుతుంది.

కార్తీక మాసంలో మాంసాహారం ముట్టుకోకుండా నియమ నిష్ఠలతో శివుని ఆరాధిస్తారు. శివ కేశవులను ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. ఈ మాసంలో దీపాలు వెలిగిస్తే కూడా పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలు వంటివి పాటిస్తూ ఉంటారు. వనభోజనాలను కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు.

బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. ఇక ఈరోజు కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం. ఈ సోమవారం నాడు ఐశ్...