Hyderabad, సెప్టెంబర్ 17 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం సెప్టెంబర్ 17 అంటే ఈరోజు బుధుడు, శని సంయోగం చెంది ప్రతియుతి దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ రెండు గ్రహాల కారణంగా ఏర్పడే ఈ అరుదైన యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. 12 రాశుల వారిపై రెండు గ్రహాల ప్రభావం ఉన్నా, కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను అందుకుంటారు.

ఈ ప్రతియుతి దృష్టి యోగం చాలా శక్తివంతమైనది. ఈ యోగం మూడు రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులను తీసుకు వస్తుంది. గ్రహాల మార్పు వలన సమాజంలో, వ్యక్తి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు అది ఇంకా ఎక్కువ మార్పులను తీసుకువస్తుంది.

జ్యోతిష్య లెక్కల ప్రకారం బుధుడు, శని ఈరోజు రాత్రి 11...