Hyderabad, జూలై 7 -- వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు బుద్ధి, వాక్కు, తర్కం, గణితం, వ్యాపారానికి కారకుడు. బుధుని గ్రహాల యువరాజు అని అంటారు. జాతకంలో బుధుడు బలంగా ఉంటే వ్యక్తి తీక్షణ బుద్ధి, తెలివిగా ఉంటాడు. బలహీనంగా ఉన్నట్లయితే లోపాలు తలెత్తుతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ఈరోజు నక్షత్రం మార్చాడు. జూలై 7 సోమవారం ఉదయం 5:55 గంటలకు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీంతో బుధుని నక్షత్ర మార్పు 5 రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది.

మిథున రాశి వారికి బుధుని నక్షత్ర మార్పు శుభ ఫలితాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. కొత్త పనిని ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం.

కన్య రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. బుధుని నక్షత్ర మ...