భారతదేశం, జూన్ 26 -- మన భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్, ఇస్రో వ్యోమగామి శుభాంషు శుక్లా ప్రయాణిస్తున్న యాక్సియం-4 మిషన్.. ఈరోజు, అంటే గురువారం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ISS) చేరుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. దాదాపు నెల రోజుల జాప్యాలు, వాయిదాల తర్వాత, Ax-4 బృందం జూన్ 25న స్పేస్‌ఎక్స్ 'డ్రాగన్' వ్యోమనౌకలో విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్-9 రాకెట్, డ్రాగన్ అంతరిక్ష నౌక నింగిలోకి ఎగిరాయి. ఈ వ్యోమనౌక ఈరోజు జూన్ 26న ISSను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యోమగాముల 14 రోజుల మిషన్ అధికారికంగా మొదలవుతుంది.

ఈ మిషన్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్న శుభాన్షు శుక్లాతో పాటు, Ax-4 బృందంలో అమెరికాకు చెందిన కమాండర్ పెగ్గి విట్సన్, పోలాండ్‌కు చెందిన మిషన్ స్పెషలిస్ట్ స...