భారతదేశం, ఏప్రిల్ 30 -- ఈపీఎఫ్ఓలోని ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మే 2025లో దీనిపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈపీఎస్ కనీస పెన్షన్ పెంపు ఎంత ఉంటుందనే విషయంపై వేర్వేరు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కనీస పెన్షన్ పెంపు రూ. 3,000 ఉండొచ్చని కొందరు, రూ. 7,500 లేదా రూ. 9,000 వరకు ఉంటుందని మరి కొందరు ఆశిస్తున్నారు.

అయితే, ఈ ఈపీఎస్ కనీస పెన్షన్ పెంపునకు సంబంధించిన వార్తలు ఊహాగానాలు, అంచనాలు మాత్రమేనని గుర్తించాలి. ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుంచి కానీ, లేదా ఈపీఎఫ్ఓ ​​నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదన్న విషయం గమనించాలి.

ఈపీఎస్ కింద ప్రస్తుత కనీస పెన్షన్ పెన్షనర్లకు నెలకు రూ.1,000 నుండి రూ.2,000 వరకు ఉంది. ఇది సెప్టెంబర్ 1, 2014నుంచి అమల్లో ఉంది. కాగా, ఈ...