Telangana,hyderabad, ఆగస్టు 27 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నుంచి ప్రకటన వెలువడింది. ఆగస్ట్ 30వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈసారి జరగబోయే సమావేశాలు వాడీవేడీగా కొనసాగే అవకాశం ఉంది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను సభలో పెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. సభలో చర్చించిన తర్వాత. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నివేదికపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై జీఓ జారీ చేసే విషయంపై కూడా సర్కార్ కసరత్తు చేస్తోంది. సభ మొదటిరోజు పూర్తయ్యాక కేబినెట్ భేటీ కానుంది. ఇందులో ...