భారతదేశం, డిసెంబర్ 18 -- తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 29 నుంచి జ‌న‌వ‌రి 2వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజైన డిసెంబ‌రు 29వ తేదీన శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్ర‌శేఖ‌ర్ స్వామివారు పుష్కరిణిలో 9 చుట్లు విహరిస్తారు.

న‌వంబ‌రు 30న శ్రీ వ‌ళ్ళి దేవ‌సేన స‌మేత శ్రీ సుబ్రమణ్యస్వామివారు 9 చుట్లు, డిసెంబ‌రు 31న‌ శ్రీ సోమస్కందస్వామివారు 9 చుట్లు, జ‌న‌వ‌రి 1న‌ శ్రీ కామాక్షి అమ్మవారు 9 చుట్లు, జ‌న‌వ‌రి 2న‌ శ్రీ చండికేశ్వరస్వామివారు మ‌రియు శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై 9 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.

ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఊంజ‌ల సేవ‌, తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 3వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 6 నుండి రాత్రి ...