భారతదేశం, జనవరి 8 -- తిరుమలలో ఈనెల 25వ తేదీన రథసప్తమి జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇవాళ టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రథ సప్తమి రోజున భద్రత, భ‌క్తుల ర‌ద్దీ నిర్వహణ, తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనాలను అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేశారని ప్రకటించారు. అధికారులందరూ అదే స్ఫూర్తితో రథ సప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్ సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా భ‌క్తుల‌ రద్దీని అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్ , అత్యవసర టీమ్స్ లపై ప్రత్యేక దృ...