Hyderabad,telangana, ఏప్రిల్ 20 -- తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది.

ఇంటర్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాభ వన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం. సుమారుగా 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా.. రెండవ సంవత్సరం విద్యార్థులు 5,08,253 మంది ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్‌ పరీక్షలను మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించారు. పరీక్షలు ఓవైపు కొనసాగుతుండగానే.. మరోవైపు స్పాట్ ప్...