భారతదేశం, నవంబర్ 7 -- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనకు రానున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 20వ తేదీన తిరుమలకు రానున్నారు. తొలుత నవంబర్ 20న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత తిరుమలకు చేరుకుంటారు. నవంబర్ 21వ తేదీన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముర్ము పూజలు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబరు 21వ తేదీన తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముందుగా నవంబరు 20న తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారని వివరించింది.

ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబరు 21న రాష్ట్రపతి ముర్ము. ముందుగా శ్రీ ...