భారతదేశం, ఫిబ్రవరి 17 -- యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 18వ తేదీన స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై. ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి నిర్వహించే డోలోత్సవంతో ముగుస్తాయి. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24వ తేదీన రాత్రి ఎదుర్కోలు ఉంటుంది. ఈనెల 25న రాత్రి తిరుకళ్యాణ మహోత్సవం, 26వ తేదీన దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 26 వరకు స్వామి వారికి వివిధ అలంకార సేవలు జరుగుతాయి.

ఆరు రోజులపాటు అలంకార సేవలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో 100 మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు, పండితులు పాల్గొననున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణమంతా వ...