Andhrapradesh, అక్టోబర్ 7 -- ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ప్రధాని మోదీ టూర్ పై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.ఈ నెల 16 తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటనకు వస్తున్నారని తెలిపారు. ఈ పర్యటన నేపథ్యంలో.. డ్రోన్ సిటీకి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబరులో డ్రోన్ షో నిర్వహించాలని నిర్ణయించారు.

డ్రోన్ల వినియోగానికి సంబంధించి ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రైవేటు వినియోగం కూడా పెరిగేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వైద్య రంగంతో పాటు వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వినియోగం...