భారతదేశం, నవంబర్ 9 -- రాష్ట్రంలోని 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ నెల 10,11 తేదీల్లో ఆయా బృందాలు. క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తాయి. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో నష్టాల్ని పరిశీలిస్తాయి.

మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఎడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం (ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం) ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తుంది. సోమ, మంగళవారాల్లో ఈ పర్యటన ఉంటుందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

రెండు టీమ్ లుగా ఏర్పడి ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను అంచనా వేస్తారు. సోమవారం టీమ్-1 బాపట్ల జిల్లాలో, టీం-2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల...