భారతదేశం, ఏప్రిల్ 27 -- హీరో మహేశ్ బాబు ఈడీకి లేఖ రాశారు. షూటింగ్ ఉన్నందున సోమవారం విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులను విజ్ఞప్తి చేశారు.

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో సినీ నటుడు మహేశ్ బాబుకు ఇటీవల ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీలకు మహేశ్ బాబు ప్రచారకర్తగా ఉన్నారు. ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు మహేశ్ బాబు ఇన్ ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ నోటీసులపై స్పందించిన మహేశ్ బాబు...విచారణకు కొంత సమయం ఇవ్వాలని కోరారు.

టాలీవుడ్ అగ్ర హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇబ్బందుల్లో పడ్డారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్న ఆయనకు ఎన్‍ఫోర...