భారతదేశం, మే 11 -- హైదరాబాద్ నగరంలో కబ్జాలు చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్క్‌లు కబ్జాచేస్తే.. ఈడీ తరహాలో వారి ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేస్తామని హెచ్చరించారు. హైడ్రా పోలీస్‌స్టేషన్‌లో నేరుగా కేసులు నమోదు చేయరన్న రంగనాథ్.. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నాంపల్లి ఏసీజే ప్రత్యేక కోర్టులో.. హైడ్రా కేసులను విచారణ చేస్తారని వివరించారు. కబ్జా చేసినట్టు నిరూపణ అయితే జైలు శిక్ష పడుతుందని.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 8వ తేదీన హైదరాబాద్‌లో మొట్టమొదటి హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. దీన్ని ముఖ్యంగా చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తులు వంటి ముఖ్యమైన ప్రభుత్వ భూము...