భారతదేశం, నవంబర్ 1 -- ఈటీవీ విన్.. వరుసగా ఒరిజినల్ సిరీస్, సినిమాలతో ఓటీటీలో రచ్చ లేపుతోంది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్, ఏఐఆర్, కానిస్టేబుల్ కనకం సిరీస్ లు.. అనగనగా, లిటిల్ హార్ట్స్ సినిమాలతో అదరగొట్టింది ఈటీవీ విన్. ఇదే క్రమంలో ఇప్పుడు మరో ఒరిజినల్ మూవీని రిలీజ్ చేయనుంది. ఫుల్ కామెడీ జానర్ లో సినిమాను తీసుకు రానుంది. ఈ మూవీ టైటిల్ ను ఇవాళ (నవంబర్ 1) అనౌన్స్ చేశారు.

ఈటీవీ విన్ ఒరిజినల్ ఫిల్మ్ గా 'ఏనుగుతొండం ఘటికాచలం' రాబోతోంది. ఈ సినిమాకు రవిబాబు డైరెక్టర్ కావడం విశేషం. అల్లరి నుంచి మొదలు పార్టీ, నచ్చావులే, అమరావతి, మనసారా, అవును, అదుగో, ఆవిరి, క్రష్ లాంటి సినిమాలకు రవిబాబు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఎన్నో తెలుగు సినిమాల్లోనూ నటించాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఈటీవీ విన్ కోసం ఏనుగుతొండం ఘటికాచలం మూవీ సిద్ధమైంది.

ఈటీవీ విన్ ఓటీటీల...